![](https://aakerutelugunews.com/wp-content/uploads/2024/12/medak_V_jpg-816x480-4g.webp)
* వందేళ్ల మహా దేవాలయం ఇదన్న బిషప్
ఆకేరు న్యూస్, మెదక్ : ఆసియా ఖండంలో రెండో అతి పెద్దదైన మెదక్ చర్చి(Medak Church)లో క్రిస్మస్ ఘనంగా వేడుకలు జరిగాయి. ‘ బెత్లెహెంలో దావీదు వంశంలో ఏసు జన్మించాడు. ఏసును కలిగిన బిడ్డలు నిస్వార్థంగా ఆలోచించాలి. స్వార్థ లోకంలో ప్రతిది నాది అనే ఆలోచనతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు స్వార్థమైన ప్రార్థనలు చేయాలి. స్వార్థం మరియమ్మలో లేదు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ బతకాలి.’ అని ఇంచార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ అన్నారు. ఈ మహా దేవాలయంలో 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరిగాయని , ఇప్పుడు వందేళ్ల పండగ జరుపుకుంటున్నామన్నారు.
…………………………………….