
* సినీ పరిశ్రమ కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి
* రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రమోట్ చేయాలి
* బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు
* సినీ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు హైదరాబాద్‌లో సదస్సు
* సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా ఉద్దేశం
* డ్రగ్స్, సామాజిక అంశాలపై సినీ పరిశ్రమ ప్రచారం చేయాలి
* సీనీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు
* అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపమని ఉద్ఘాటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని, సినీ పరిశ్రమ కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CHIEF MINISTER REVANTHREDDY) తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో సినీ ప్రముఖులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రమోట్ చేసేందుకు పరిశ్రమ సహకరించాలన్నారు. బాలీవుడ్(BOLLYWOOD), హాలీవుడ్(HOLLYWOOD) హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సదస్సు ద్వారా సినీ పరిశ్రమలను ఆకట్టుకునే యత్నం చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. డ్రగ్స్, సామాజిక అంశాలపై సినీ పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు.
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం
తెలుగు సినీ పరిశ్రమకు బ్రాండ్ తీసుకురావాలనేదే తమ నిర్ణయం, ఈ దిశలో ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఎఫ్డీసీ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వట్లేదని తెలిసి.. గద్దర్ అవార్డులు(GADDAR AWARDS) ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనదని, తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండవని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ (ALLU ARJUN)తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునని, అతడిపై తనకెందుకు కోపం ఉంటుందని సినీ ప్రముఖులతో రేవంత్ అన్నారు. పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామన్నారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
……………………………………………………………….