* బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల అంశం చాలా చిన్నది : దిల్ రాజు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : హైదరాబాద్‌ను సినీ పరిశ్రమకు అంతర్జాతీయ హబ్‌గా చేయడమే తమ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Fdc Chairman Dil Raju)తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల అంశం చాలా చిన్నదని, వాటి కోసం మరోసారి సమావేశం అవుతామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ తరఫున తెలుగు చలన చిత్రవాణిజ్య మండలి రేవంత్ రెడ్డి(Revanthreddy)కి వినపత్రిం అందజేసినట్లు తెలిపారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అనేది అపోహ మాత్రమే అన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. హాలీవుడ్ షూటింగ్‌ల మేరకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని సీనీ పెద్దలు కోరినట్లు తెలిపారు. సానుకూల దృక్పథంతో పరిశ్రమ పనిచేయాలన్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
