* ఆయన కోసం ఏం చేసినా బీఆర్ ఎస్ మద్దతు
* దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి : హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత రత్నకు మన్మోహన్ సింగ్ 100 శాతం అర్హులే అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తమ పార్టీ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అసెంబ్లీలో మన్మోహన్ సంతాపసభలో ఆయన మాట్లాడారు. ఆయనపై పీవీ నర్సింహారావు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయలేదన్నారు. పీవీ(PV) ఖ్యాతిని చాటేలా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం స్కిల్ వర్సిటీకి నరసింహారావు పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పీవీ-మన్మోహన్ ద్వయం దారిన పెట్టిందని వివరించారు. 1996లో కాంగ్రెస్(Congress) ఓటమికి ఆర్థిక సంస్కరణలూ కారణమని ఓ కమిటీ నివేదిక ఇచ్చిందని, దానిని చూసిన మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారని గుర్తు చేశారు. మన్మోహన్ కు విదేశాల్లోనూ ఆయనకు ఉన్నత ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వాటికంటే దేశమే ముఖ్యమని చాటిన గొప్ప వ్యక్తి మన్మోహన్ అని చెప్పారు. మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
