![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/KTR.jpg)
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్(Formula E car Race) కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్(Banjarahills) లోని ఏసిబి కార్యాలయం వద్ద ఉత్కంఠ ఏర్పడింది. కేటీఆర్ తన లాయర్లతో ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే, లాయర్లు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్ళకూడదని పోలీసులు వాహనాన్ని నిలిపివేశారు. లాయర్లను ఇక్కడ దించేసి కేటీఆర్ మాత్రమే లోనికి రావాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోనివ్వాలని ఆయన పోలీసులను కోరారు. లీగల్ టీమ్(Legal Team) ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు. కానీ, పోలీసులు అంగీకరించలేదు. కాసేపు వెయిట్ చేసి.. తన విజ్ఞాపనను పోలీసులకు అందజేసి, వెనుదిరిగారు. కార్యాలయానికి వచ్చినట్లే వచ్చి విచారణకు హాజరుకాకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.
………………………………………….