* రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, యాదాద్రి భువనగిరి : సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని.. అలంటప్పుడే విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతూ మార్గమధ్యంలో బీబీనగర్‌లోని ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందన్నారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మోటిక్ ఛార్జీల వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు కావాల్సిన పోషకాలు అందిస్తేనే మెదడు చురుకుగా పనిచేసి టీచర్లు బోధించే పాటాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటారని వివరించారు. క్యాబినెట్ సహచరులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తరచూ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అందుతున్న సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
