* అక్రమ కేసులకు భయపడేది లేదు : ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr)పై సర్కారు ప్రతీకారేచ్చతో రగిలిపోతోందని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి ఆమె నివాళులర్పించారు. ఆసిఫాబాద్‌లోని దేవునిగూడ గ్రామంలోని ఆదివాసీ గోండు అక్కాచెల్లెళ్ళతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత(Kavitha) మీడియాతో మాట్లాడుతూ ప్రజల తరఫున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని ఆమె మండిపడ్డారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
