Yoga Association Telangana Competitions
* యోగా అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకుడు బొలిశెట్టి కమలాకర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: యోగాతో ప్రశాంతత ఉంటుందని యోగా అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకుడు బొలిశెట్టి కమలాకర్ అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రం మా గార్డెన్ లో జనగామ జిల్లా స్థాయి యోగా ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకుడు బొలిశెట్టి కమలాకర్ మాట్లాడుతూ యోగా తో ప్రశాంతత పొందుతామని అన్నారు. యోగా మనసు శరీరాన్ని అనుసంధానం చేసి సమన్వయపరుస్తుందని అన్నారు. అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఈనెల 12, 13 తేదీల్లో కరీంనగర్ లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు.
జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడు అన్నెపు రాజేంద్రం, కార్యదర్శి చందా సాంబరాజు, కోశాధికారి గోపు నరేష్, ఉపాధ్యక్షురాలు మౌనిక, సంయుక్త కార్యదర్శి సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొంతం కుమార్, తాళ్లపల్లి సంజనా, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 7వ కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్, 9 వ కౌన్సిలర్ సౌదర పెళ్లి సంపత్ రాజ్, హనుమకొండ జిల్లా యోగ అసోసియేషన్ బాధ్యులు బాల్నేని శ్రీధర్, కిషన్ నాయక్, కిరణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్,దేవ్ సింగ్ రాథోడ్, శ్రీధర్, ఉమాదేవి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
