* గేమ్‌ఛేంజర్ టిక్కెట్ ధరల పెంపు, షోలపై హరీష్ రావు విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: గేమ్ చేంజర్ సినిమా అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. అసెంబ్లీ వేధికగా చెప్పిన మాటలకే విలువ లేదన్నారు. ఇక విూదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రెడ్డి.. రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని విమర్శలు గుప్పించారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం నీటి మూటలు అయ్యాయన్నారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని హరీష్ రావు ప్రకటించారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
