* డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ గా బండారి సుధాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన అధ్యక్షుడిగా మండలంలోని ఉప్పల్ పల్లె గ్రామానికి చెందిన ర్యాకం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కాగా బిజెపి పార్టీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ కమలాపూర్ మండలానికి గాను ఉప్పల్ గ్రామానికి చెందిన బండారి సుధాకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , కరీంనగర్ బీజేపి ఎన్నికల ఇంచార్జి సంకినేని వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎనలేని సేవలు చేసి పార్టీ బలోపేతానికి కృషికి గుర్తింపుగానే మండల అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో బిజెపి పార్టీని గ్రామస్థాయి నుండి, మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే వరకు కృషి చేస్తానని నూతన బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ అన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
