![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/images-14.jpg)
* నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఆందోళన
* ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాతో రైతులు హెచ్చరిక
ఆకేరు న్యూస్, నాగర్ కర్నూలు : జిల్లాలోని బల్మూరు మండలం మైలారం(Mylaaram) గ్రామంలో “మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు” పేరుతో కొంత కాలంగా జరుగుతున్న ఆందోళన ఈరోజు తీవ్ర రూపం దాల్చింది. స్థానికులు రిలే నిరాహారదీక్షలకు పిలుపునిచ్చారు. రిలే దీక్షలకు పిలుపు నేపథ్యంలో కొంత మంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు(Formers) రోడ్డెక్కారు. కొందరు స్థానికులతో కలిసి పురుగుల మందు డబ్బాతో రహదారిపై రైతులు ఆందోళన (Agitition)చేపట్టారు. గ్రామానికి పోలీసులు రాకుండా స్థానికులు ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. మైలారం గ్రామానికి అనుకుని ఉన్న గుట్టకు విడదీయరాని బంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ గుట్టను ఆనుకునే 100కు పైగా నివాసాలుంటాయి. గుట్ట తవ్వకం పనులు చేపడితే తాము ఇళ్లను కోల్పోతామని గ్రామస్థులు అంటున్నారు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టను క్వార్ట్జ్ తవ్వకం కోసం 2021లో ఓ ప్రైవేటు సంస్థకు మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అప్పటి నుంచీ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
……………………………………..