![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-1-13.jpg)
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ (Secunderabad)జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ మీద ఓ అమ్మాయి మొండెం.. తల వేర్వేరుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈరోజు అటుగా వాకింగ్ చేస్తున్న వారు యువతి మృతదేహాన్ని(Teenager Dedadbody) చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ఉదయం వాకింగ్ కు వెళ్లగా రైల్వే ట్రాక్ పై ఓ యువతి మృతదేహాన్ని చూశారు. తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు గుర్తించారు. పట్టాలపై పడుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుందా,. ఆమె మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలియాల్సి ఉంది.
…………………………………………