ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆరేళ్ల కిందటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దర్శకుడు ాంగోపాల్ వర్మకు దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో ఆర్జీవీపై చెక్‌బౌన్స్ కేసు నమోదు కాగా.. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ ఒక్కసారి కూడూ కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడిరచింది.
………………………………………