ఆకేరున్యూస్, హన్మకొండ: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడతున్న మహిళా దొంగను హనుమకొండ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. నిందితురాలి నుండి సుమారు 15లక్షల 50 వేల రూపాయల విలువ గల 188 గ్రాముల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెసుకు సంబంధించి హనుమకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిరచారు. వరంగల్ శివనగర్ ప్రాంతంలో నివాసం వుంటున్న కట్రోజు విజయ(50) భర్త కార్పెంటర్‌గా పనిచేస్తూ వచ్చిన అదాయంతో అతను మద్యం సేవిస్తుండంతో ఇంటి అవసరాలకు డబ్బు లేకపోవడంతో పాటు, ఇల్లు గడవడం కష్టం కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుంది. ఇందుకోసం బట్టల దుకాణాల్లో చీరల చోరీలతో పాటు బస్సులు, రైలు, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని బంగారు అభరణాల చోరీలకు పాల్పడేందుకు నిందితురాలు సిద్దపడింది. ఇందులో భాగంగా నిందితురాలు మొదటిసారిగా ఖమ్మం నుండి రైలులో వరంగల్‌కు వస్తున్న క్రమంలో తొలిసారి మహిళ బ్యాగులోని పర్సు చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళింది. ఇదే రీతీలో నిందితురాలు ఇంతేజార్గంజ్ పరిధిలో 7చోరీలకు, మట్టెవాడ, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చొప్పున హసన్‌పర్తి, కొత్తగూడెం, ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 14 చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు జీవితం గడిపింది. నిందితురాలు జైలు నుండి విడుదల అయిన అనంతరం ఆమెలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు, నిందితులు గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో హనుమకొండ బస్టాండ్‌లో ఒంటరిగా బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు అభరణాలను చోరీ చేయగా, డిసెంబర్లో హనుమకొండ బస్టాండ్ ప్రయాణికురాలి బ్యాగులో రహస్యంగా భద్రపర్చిన బంగారు అభరణాలు చోరీ చేసింది. ఇదే రీతిలో నాలుగు రోజు క్రితం మళ్లీ హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగ్ నుండి బంగారు అభరణాలు చోరీ చేసింది. ఈ నాలుగు చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన హనుమకొండ పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా సూచనల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీని వినియోగించుకుని నిందితురాలిని గుర్తించి ఆమె కదలికలపై నిఘా పెట్టారు. ఈ రోజు ఉదయం చోరీ సోత్తును అమ్మేందుకు టైలర్ స్ట్రీట్ వెళ్తుండగా పోలీసులను చూసి నిందితురాలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానంతో పెట్రోలింగ్ పోలీసులు నిందితురాలిని అదుపులోని తీసుకోని తనీఖీ చేశారు. చోరీ సోత్తును గుర్తించిన పోలీసులు నిందితురాలి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితురాలు పాల్పడిన నేరాలను అంగీకరించింది. నిందితురాలు పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ సతీష్, క్రైమ్ ఎస్.ఐ కిషోర్, అడ్మిన్ ఎస్. ఐ అశోక్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు నారాయణ, రహుఫ్, కానిస్టేబుళ్ళు మహేష్, అశోక్, వీరన్న, భాస్కర్లను ఏసీపి అభినందించారు.
………………………………………