* స్పీకర్ కు లేఖ అందించిన వైసీపీ ఎంపీ
ఆకేరున్యూస్, అమరావతి: వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy )తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా (Resignation) చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖడ్(Chairman Dhakad) కు రాజీనామా లేఖను శనివారం అందించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన నిన్న ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్వతానికి కూడా రాజీనామా చేస్తున్నానని, వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు. ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని అన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్( Jagan)కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అని తెలిపారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
