![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-68.jpg)
* కీలక అంశాలపై చర్చకు అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్ : రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ (Cabinet) భేటీ కానుంది. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ (Seetharaman) బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది. బడ్జెట్ లో వర్గాల వారీగా కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వేతనజీవులకు ఊరట కలిగిలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పది లక్షల రూపాయల వరకు ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రచారం కలుగుతోంది. కొత్తగా 25శాతం పన్ను స్లాబ్ యోచనలో పరిశీలినలో ఉన్నట్లు తెలుస్తోంది.
……………………………………