* కడియంశ్రీహరి ఇంటికి దీపాదాస్ మున్షి, ఇతర నేతలు
* ఇద్దరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. దీపాదాస్ మున్షీ
* శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం: కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో చేరాలా..? హైదరాబాద్‌లోనా అన్న అంశం గురించే ఆలోచిస్తున్నారని తెలిసింది. కాగా కడియం కావ్య బీఆర్ ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్టు గురువారం రాత్రి లేఖ విడుదల చేశారు. దీంతో తండ్రి , కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం కడియం శ్రీహరి హైదరాబాద్ నివాసానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చి కలిశారు. తెలగాణ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ , రోహిత్ చౌదరీ, విష్ణు ,మల్లు రవి, సంపత్ కుమార్ తదితర నేతలు కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళిన వారిలో ఉన్నారు. కడియం శ్రీహరి, కావ్యలతో మాట్లాడిన అనంతరం దీపాదాస్ మీడియాతో మాట్లాడారు.
* కడియం శ్రీహరి, కావ్యలను పార్టీలోకి ఆహ్వానించాం.
– దీపాదాస్ మున్షీ
కడియం శ్రీహరి, కడియం కావ్యలతో మాట్లాడాం. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతందని చెప్పాం. కాంగ్రెస పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే తో కడియం శ్రీహరి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కడియం శ్రీహరి, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా ఖర్గే ఏకకాలంలో పనిచేశారు. కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం చెబుతానని కడియం శ్రీహరి చెప్పారు.
* శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను.
– కడియం శ్రీహరి
కాంగ్రెస్ నేత దీపాదాస్ మున్షీతో కలిసి ఏఐసీసీ, పీసీసీ నేతలు మా ఇంటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. అనేక రకాల కారణాలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. మీడియా ఇతర ప్రశ్నలకు తర్వాత వివరంగా సమాధానం చెబుతానన్నారు..
————————–