* తెలంగాణ అసెంబ్లీ లో కీలక సన్నివేశం
* సభ నిర్వహణ తీరుపై బీఆర్ ఎస్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈరోజు జరిగే తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని అంతటా భావిస్తుండగా, ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) వినతి మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) సభను వాయిదా వేశారు. కేబినెట్ సమావేశం జరుగుతోందని, ఈ సమావేశం పూర్తైన తర్వాత మినిట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. మంత్రులంతా కేబినెట్ సమావేశం కొనసాగుతున్నందున అసెంబ్లీని కొద్దిసేపు వాయిదా వేయాలని మంత్రి స్పీకర్ ను కోరారు. వెంటనే స్పీకర్ సమ్మతించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ తెలిపారు.
బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
ప్రారంభమైన వెంటనే శాసనసభను వాయిదా వేయడంపై బీఆర్ ఎస్ (Brs) ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల సమావేశం ఉదయం 8 గంటలకో.. అంతకంటే ముందో పెట్టుకోవాలి కానీ, అందుకోసం శాసనసభను వాయిదా వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారని ఆరోపించారు.
………………………………………..