![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/3c2cbaec-fd7a-4a32-9876-04d20d7dac7f-1024x682.jpg)
* కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆకేరున్యూస్, వరంగల్: రాబోయే వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికలు రూపొందించు కోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎన్పీడీసీఎల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ అత్యవసర ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా మహాత్మా గాంధీ ఆసుపత్రిలోని జనరేటర్ లను ఎప్పటికప్పుడు ఆటోమోడ్ లో ఉంచుతూ సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ సికేఎం ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రుల జనరేటర్లను మ్యానువల్ నుండి ఆటో మోడ్లో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికితోడుగా ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో, జనరేటర్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ ఎస్సీ మధుసూదన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, పర్యవేక్షకులు కిషోర్, పద్మావతి, ఆర్ ఎం ఓలు మురళి, వంశీ ప్రియ, సత్యజిత్ రే, తదితరులు పాల్గొన్నారు.
………………………………