![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/yadadri-district-collector-hanumanth-rao-1024x576.webp)
ఆకేరున్యూస్, యాదాద్రి భువనగిరి: వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ రోజు తెల్లవారుజామున ఓ విద్యార్థిని ఇంటి తలుపు తట్టి నిద్ర లేపారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో.. భరత్ చంద్ర చారి అంటూ తాను జిల్లా కలెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి కలెక్టర్‌ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్ర చారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది. కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ఐదు వేల రూపాయల సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదువేల రూపాయలను విద్యార్థి భరత్ చంద్ర చారికి అందించాడు. చదువుకునేందుకు స్టడీచైర్తో పాటు రైటింగ్ ప్యాడ్‌ను కలెక్టర్ అందించాడు.
…………………………………….