* ఆ ఎమ్మెల్యేలు భేటీకి దూరం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CHIEF MINISTER REVANTHREDDY) అధ్యక్షత సీఎల్పీ సమావేశం జరిగింది. మర్ని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(BATTI VIKRAMARKA), కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపాదాన్స్ మున్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండు బహిరంగ సభలు పెట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ వర్గీకరణపై సభలకు నిర్ణయించింది. ఈ సమావేశాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(MALLIKARJUNA KHARGE), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RAHULGANDHI)లను ఆహ్వానించాలని సీఎల్పీ నిర్ణయించింది.
సీఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల దూరం
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు (SUPRIM COURT)లో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీ సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ వారికి నోటీసులు అందజేశారు. ఈక్రమంలో సమాధానం చెప్పేందుకు వారు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సీఎల్పీ(CLP) భేటీకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. భేటీకి దూరంగా ఉన్నారు.
………………………………………….