
* ఉప్పల్ మండలాన్ని ప్రకటించకపోతే రాబోయే స్థానిక ఎన్నికలను సైతం బహిష్కరిస్తాం
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఉప్పల్ ను మండలంగా ప్రకటించాలని ప్రజల ఆందోళన వరుసగా ఐదో రోజుకు చేరుకుంది.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు,మహిళలు మండల సాధన సమితి ఆధ్వర్యంలో రోజురోజుకు వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఆదివారం గ్రామంలోని ప్రజలందరూ కలిసి డబ్బు చప్పులతో ర్యాలీగా తరలివచ్చి, హుజురాబాద్- పరకాల ప్రధాన రహదారిపై భీంపల్లి క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.రహదారిపై బైఠాయించి we want mandal అని నినదించారు. యువకులు సోషల్ మీడియా సహాయంతో మండల సాధన ఉద్యమం రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే స్థానిక ఎన్నికలను సైతం బహిష్కరిస్తం
– మాజీ జడ్పీటీసీ మారపెల్లి నవీన్
1983లో మండలాల ఏర్పాటు సందర్భంలోనే ఉప్పల్ ను మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలాన్ని ప్రకటించాలని, అప్పటిదాకా ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని, రాబోయే స్థానిక ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని మాజీ జడ్పీటీసీ మారపెల్లి నవీన్ మీడియాతో అన్నారు.
మా జెండా ఎజెండా ఉప్పల్ ను మండలం చేయడమే
– ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తోట సురేష్
కాంగ్రెస్ ,బీఆర్ఎస్,బిజెపి అన్ని పార్టీలు కలిసి ఒకే జెండాగా మారాయని, అందరి లక్ష్యం మండల ఏర్పాటు మాత్రమే, ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా మండలం ఏర్పాటు కావాలని ఎదురుచూస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పకుండా ఉప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తోట సురేష్ మీడియాతో అన్నారు. కార్యక్రమంలో మండల సాధన సమితి సభ్యులు ఎర్రబెల్లి సంపత్ రావు, దేవేందర్ రావు, పుల్ల అద్భుతరావు, తూర్పాటి భాస్కర్, కొనుకుల రాంచందర్ నద్దునూరి ప్రసాద్, క్రాంతి, జక్కుల రాజు, పోతిరెడ్డి రఘు, శ్రీనివాసరావు, మేడిపల్లి రాజు,ర్యాకం గట్టయ్య, సదానందం ,ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..