
* పాఠశాల నుంచి ఆలస్యంగా రావడమే కారణం
ఆకేరు న్యూస్, యాదాద్రి : యాదాద్రి జిల్లా (Yadadri District) చౌటుప్పల్ మండలం ఆరే గూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా ఇంటికి వచ్చాడని మద్యం మత్తులో కుమారుడిని తండ్రి తీవ్రంగా కొట్టాడు. దీంతో కుమారుడు మృతి చెందాడు. ఆరే గూడేనికి చెందిన సైదులు కుమారుడు భాను పాఠశాల ఫేర్ వెల్ పార్టీ(Farewell Party)కి వెళ్లి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న సైదులు కుమాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలతో 9వ తరగతి చదువుతున్న భాను (14) స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, సైదులును అదుపులోకి తీసుకున్నారు.
………………………………