![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/e5b9801a-7758-40d6-9a1f-ef743cc24a51-1024x684.jpg)
ఆకేరున్యూస్, వరంగల్: జాతీయ షూటింగ్ క్రీడల్లో ఛాంపియన్ షిప్ పోటీల్లో మహిళా ఏ.ఎస్.ఐ సువర్ణ కాంస్య పతకాన్ని సాధించింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న సువర్ణ గత డిసెంబర్ 15 తేది నుండి 31వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జరిగిన 67 జాతీయ షూటింగ్ క్రీడల ఛాంపియన్ షిప్ లో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొన్న సువర్ణ 50 మీటర్లు ప్రోన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ పోటీల్లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీపడిన సువర్ణ 600లకు 581 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలసి సువర్ణను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రaా ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
…………………………………………