![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/B10-1024x893.jpg)
* అధికారంలోకి వచ్చాక ప్రతిఒక్కరికీ మోసం
* రైతలు భూములు గుంజుకోవడమే రేవంత్‌కు తెలుసు
* బీఆర్ఎస్ రైతు నిరసన సభలో కేటీఆర్ విమర్శలు
ఆకేరున్యూస్, కొడంగల్: తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేవిూ లేదని ఆరోపించారు. కొడంగల్‌లో భారాస రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదు. అనుముల అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచేస్తున్నారు. రూ.కోట్లు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారు. కానీ, రేవంత్ ప్రజల కోసం పనిచేయడం లేదు. భూములు గుంజుకోవాలనేదే ఆలోచనని అన్నారు.. రైతు బంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా?’ అని ప్రశ్నించారు. నారాయణ పేట జిల్లా కోస్గిలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్ రైతుల సంక్షేమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 శాతం రైతులకు రుణమాఫీ ఇంకా జరగలేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. మా హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాలకు రైతుబంధు పథకానికి అందించామన్నారు. ఇది రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం చేసిన కృషి అని తెలిపారు. కానీ ప్రస్తుతం రైతులకు ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 17,500 రూపాయలు బాకీ ఉందని, ఈ మొత్తాన్ని త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి కంది రైతుల ధాన్యం కొనుగోలు చేయలేకపోవడం, బాధాకరమని ఆయన అన్నారు. ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రాజకీయాలపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ రైతులకు, పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగినా మేము రక్షణగా ఉంటామని కేటీఆర్ అన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కవిూషన్ల కోసమే అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోస్గి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రేవంత్ రెడ్డిని ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 50,000 ఓట్ల మెజారిటీ తక్కువగా వచ్చినా, తాను రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎప్పుడు బొంద పెడదామా అని ఎదురుచూస్తున్నారని, ఆయనపై ప్రజల ఆగ్రహం అంతగా పెరిగిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ’రేషం లేని వ్యక్తి కాబట్టి, ఆయన తుడిచేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రాష్టాన్ని ’దుర్యోధనుడు’గా అభివర్ణిస్తూ, కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో ఎనుముల అన్నదమ్ములు, అల్లుడు, అదానీ కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు. లగచర్ల పచ్చని పంట భూములపై పలువురు చేసిన వ్యాఖ్యలపై 40 మంది రైతులను జైలుకు పంపడం వంటి అంశాలను ప్రస్తావించారు. కొడంగల్ రేవంత్ అయ్య, తాత జాగీరు కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
………………………………………………..