![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/HR-1024x683.jpg)
* అన్నివర్గాలను మోసం చేసిన రేవంత్
* ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు బోనస్ అన్న మాట బోగస్ అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూతలు.. ఎన్నికలయ్యాక కోతలని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతల సర్కార్ అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రైతులకు రూ. 432 కోట్ల బిల్లులు పెండిరగ్ లో ఉన్నాయన్నారు. 48 గంటల్లో క్లియర్ చేస్తామని ఉత్తమ్ చెప్పారని, ఉత్తమ్ కుమార్ మాటలు.. ఉత్తర కుమార ప్రగల్బాలేనని మండిపడ్డారు. సన్న వడ్లకు బోనస్ విషయంలో రైతుల్ని దగా చేశారని తెలియజేశారు. పంటలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని బాధను వ్యక్తం చేశారు. రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అనేక హావిూలు ఇచ్చారని.. ప్రజలు హావిూలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల విూద రాసిచ్చిన్రు.. రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారన్నారు. సోనియా గాంధీతో లెటర్లు రాయించారని.. ఇప్పుడు హావిూలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 11సార్లు ఢల్లీి పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పోతున్నడు వస్తున్నడు కానీ.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్‌కు లేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవని హరీశ్‌రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తరో.. ఎట్ల అరెస్టులు చేస్తరో తెలయని పరిస్థితి ఉందన్నారు. ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారని.. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని.. కేసులు పెట్టి బతుకు దెరువు లేకుండా చేస్తున్నారన్నారు. ఆర్ఎంపీలను రోడ్ల విూదకు తెచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హావిూలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే.. కొందరు స్టేలు తెచ్చారన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, స్టేలు తెచ్చారన్నారు. స్టేలు తెచ్చినా మేం విూ బతుకు దెరువు ఎక్కడా ఆపలేదన్నారు. ఆర్ఎంపీలు, ఎంపీలపై కేసులు పెట్టలేదని.. పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయని హరీశ్‌రావు ఆరోపించారు. గీత కార్మికుల పొట్ట కొడుతున్నరు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మొదటి హావిూ మహాలక్ష్మి, చివరి హావిూ పింఛన్లు దిక్కు లేదని.. రైతు రుణమాఫీ విూద ఏ ఊర్లకైనా పోదాం చర్చిద్దామన్నారు. ఇవ్వాల్సింది రూ.45వేల కోట్లు అని.. ఇస్తానన్నది 31 అని.. ఇచ్చినా అని చెబుతున్నది 21.. ఇచ్చింది రూ.15-రూ.16వేల కోట్లు మాత్రమేనన్నారు. రుణమాఫీ ఓ మోసమని.. రూ.15-16వేల కోట్లు ఎట్ల ఇచ్చిండంటే.. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టి రూ.8వేల కోట్లు, రుణమాఫీకి ఇచ్చిండని మండిపడ్డారు. రెండు నెలల పింఛన్ 2వేల కోట్లు ఎగ్గొట్టి, రుణమాపీకి ఇచ్చిండని.. కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ చీరెలు వెయ్యి కోట్లు ఎగ్గొట్టి, రుణమాఫీకి మలిపిండన్నారు. కేసీఆర్ ఇచ్చే న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టిండని.. అందులో రెండు వేల కోట్లు.. పిల్లల ఫీజు రియింబర్స్ మెంట్ కూడా ఎగ్గొట్టిండు. రూ.2500 కోట్లు రుణమాఫీల కలిపిండని విమర్శించారు. ఇట్ల కోతలు కోసిండు రుణమాఫీలో కలిపిండంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.
…………………………………