
* 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలే
* అమన్‌గల్లు రైతు దీక్షలో కేటీఆర్
ఆకేరు న్యూస్, ఆమన్‌గల్ : రేవంత్ రెడ్డి త్వరలోనే ఆడబిడ్డల మెడలోని పుస్తెలతాడు కూడా ఎత్తుకుపోతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష(RYTHU DEEKSHA)లో సెటైర్లు వేశారు. కేసీఆర్ హయాంలో రైతు ఒక రాజులాగా బతికాడని తెలిపారు. ఈ పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరికీ న్యాయం చేయలేదని, రైతు రుణమాపీ, రైతుబంధు, తులం బంగారం, మహిళలకు రూ. 2500 రాలేదు. 420 హామీలిచ్చి దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు… రాష్ట్రమంతా పక్కన పెడితే.. సొంత నియోజకరవ్గరం, సొంత తాలుకాలో కూడా ఒక్కపనీ చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపిండు రేవంత్ రెడ్డి(REVANTHREDDY).. అత్తకు రూ. 4 వేలు.. కోడలికి రూ. 2500 అన్నాడు. రూ. 500కు సిలిండర్ అన్నడు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నడు.. ఇప్పటి వరకు ఏది లేదు. 35 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిండు తప్ప 35 పైసలు ఢిల్లీ నుంచి తేలేదు అని కేటీఆర్ విమర్శించారు.
…………………………………