ఆకేరున్యూస్, ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్గా వివేక్జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నూతన కమిటీ నియామకం చేస్తున్నదని, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినప్పటికీ నూతన సిఇసిగా జ్ఞానేష్ కుమార్ నియామకానికే కేంద్రం మొగ్గుచూపింది. 2029 జనవరి 26 వరకూ ఆయన సిఇసిగా కొనసాగనున్నారు. ప్రస్తుత సిఇసి రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగిసింది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
