
* ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన గులాబీ బాస్
* కేసీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సుదీర్ఘకాలం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ (KCR) తెలంగాణభవన్‌కు విచ్చేస్తున్నారు. అక్కడ మధ్యాహ్నం జరగబోయే రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. పలు హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైన నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగడం ఉత్కంఠను రేపుతోంది. గడువు ముగిసింది.. ఇక యుద్ధమే.. అని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో తనను కలిసిన నాయకులతో ఇదివరకే ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్(HYDERABAD)కు బయల్దేరారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్(TELANGANABHAVAN)కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు. బీఆర్ఎస్ (BRS)ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నట్టు వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
బహిరంగ సభకు ఏర్పాట్లు
ఎన్నికలు ముగిసిన తర్వాత అడపాదడపా ప్రకటనలు.., ఒకసారి అసెంబ్లీలో మినహా కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఏడాదిపైనే గడిచిన నేపథ్యంలో ఇక కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే నెలాఖరులోనే బహిరంగ సభ (PUBLIC MEETING)నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే, బహిరంగసభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు నిర్వహించాలా? లేదా పార్టీ అధ్య క్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించా లా? అనే అంశంపై తాజా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
………………………………………………..