* ఆర్టీసీ ఎక్కండి.. డిస్కౌంట్ పొందండి..
* ప్రత్యేక రాయితీలు ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
ఆకేరు న్యూస్ఖ, హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విజయవాడ (Hyderabad to Vijayawada) రూట్లో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఎండీ సజ్జనార్(Sajjanar).. తాజాగా హైదరాబాద్- విజయవాడ రూట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త తెలిపారు.. లహారి – నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ, అదే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించారు. విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
