
* ప్రజాపాలనలో కాంగ్రెస్ విఫలమైంది..
* ప్రజల కష్టాలు బీఆర్ఎస్కే తెలుసు
* పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాసిపెట్టుకోండి.. వంద శాతం మనమే మళ్లీ అధికారంలోకి వస్తాం.. అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Kalvakuntla Chandrashekara Rao) శ్రేణులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగింది. దాదాపు ఏడు నెలల అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయన వచ్చే సమయంలో సీఎం.. సీఎం.. అంటూ బీఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ వస్తున్నారని అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తెలగాణభవన్(Telangan Bhavan)కు తరలివచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణ(Telangnana)ను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
………………………………………………………