Published:
ఆకేరున్యూస్, ఢిల్లీ: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఈసి)గా జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన సోమవారం నాడు సిఈసిగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. నేడు విచారణకు రానున్నాయి.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
