
* వీడిన రాజలింగమూర్తి హత్యకేసు చిక్కుముడి..
* భూతాగాదాలతోనే హత్య
* హత్యకేసును ఛేదించిన పోలీసులు
* ఏడుగురు అరెస్ట్.. పరారీలో ముగ్గురు..
* నిందితుల్లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
ఆకేరు న్యూస్, భూపాలపల్లి : భూపాలపల్లిలోని నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసు (Rajalingamurthy murder case)చిక్కుముడి వీడింది. భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడ్డ వారిలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ కిరణ్ ఖరే కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈకేసులో రేణుగంట సంజీవ్ (ఏ1), పిలింగిలి సేమంత్ (ఏ2), మోరె కుమార్ (ఏ3), కొత్తూరి కిరణ్ (ఏ4), రేణికుంట్ల కొమురయ్య (ఏ5), దాసరపు కృష్ణ (ఏ6), రేణికుంట్ల సాంబయ్య (ఏ7), కొత్త హరిబాబు (ఏ8), పుల్లా సురేష్ (ఏ9), పి. సురేష్ (ఏ10)లను నిందితులుగా గుర్తించారు. ఏడుగురిని అరెస్ట్ చేయగా, ఏ8, ఏ9, ఏ10 పరారీలో ఉన్నారు. రాజలింగమూర్తికి, నిందితులకు మధ్య 01 ఎకరం భూమి విషయంలో తగాదా నడుస్తోంది. ఏ1 సంజీవ్ కుటుంబ సభ్యుల నుంచి ఆ భూమిని బలవంతంగా లింగమూర్తి రాయించుకున్నాడని ఆయనపై కక్ష పెంచుకున్నారు. అతడిని హత్య చేయాలని భావించాడు. బంధువుల సహకారం కోరాడు. లింగమూర్తి చంపేసి ఆ భూమిని అందరమూ పంచుకుందామనడంతో వార కూడా సరేనన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు.
ఆ నాకొడుకును చంపేయరా..
గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన కొత్త హరిబాబు (Kotha Haribabu)వద్దకు వెళ్లి సంజీవ్ విషయం చెప్పగా, ఆ నా కొడుకును చంపేయరా.. బెయిలు ఇతర ఖర్చులు నేను చూసుకుంటానని రెచ్చగొట్టాడు. హత్యకు పథకంలో భాగంగా రెండు నెలల క్రితమే సంజీవ, మోరె కొడుకులు కలిసి వరంగల్ లో రెండు కత్తులు, ఒక రాడ్డు కొనుగోలు చేశారు. ఈనెల 19న సంజీవ్ కోర్టులో పేషీకి వెళ్లగా అక్కడ లింగమూర్తి కూడా కనిపించాడు. దీంతో ఇదివరకే చర్చించిన తన బంధుమిత్రులకు ఫోన్ చేసి.. ఈరోజు ఎలాగైనా లింగమూర్తిని చంపేద్దామని పిలిచాడు. లింగమూర్తి కదలికలను గుర్తించాలని దాసరి కృష్ణ, నరేష్‌లకు చెప్పారు. సంజీవ్, కొత్తూరి కిరణ్, మోరె కుమార్, బబ్లు.. కత్తులు, రాడ్లతో లింగమూర్తి ఇంటి సమీపంలో కాపు కాశారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో లింగమూర్తి తన ఇంటివైపు టర్న్ తీసుకుండగా, బండికి అడ్డం పడి దాడి (Attack)చేశారు. కళ్లల్లో కారం చల్లారు. కత్తులు, రాడ్లతో విచక్షణా రహితంగా పొడిచి, కొట్టి చంపేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. హత్య అనంతరం సంజీవ్, బబ్లు హరిబాబుతో ఫోన్లో మాట్లాడారు. డబ్బు సమకూర్చుకుని ఎక్కడికైనా పారిపోదామని ఈరోజు ఉదయమ పథకం వేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించారు. ఏ8, ఏ9, ఏ10 పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మీడియా సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, చిట్యాల సీఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని ఎస్పీ అభినందించారు.
………………………………………..