– విధ్యార్థులకు ఆల్ ది బెస్ట్ : మంత్రి పొన్నం ప్రభాకర్
– ఎంట్రన్స్ పరీక్షకు మొత్తం 1,67,708 అప్లికేషన్లు
– 5 వ తరగతిలో ప్రవేశానికి 88,824 అప్లికేషన్లు
– 6 6వ తరగతి ప్రవేశానికి 32,672 అప్లికేషన్లు
– మొత్తం సీట్ల సంఖ్య 51,968.
ఆకేరు న్యూస్ కమలాపూర్ : గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రేపు ఆదివారం జరగనుంది. విధ్యార్థులంతా ప్రశాంతత వాతావరణంలో పరీక్ష రాసేలా చర్యలు చేపట్టాలని రవాణా, బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సామాజిక వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. మొత్తం 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 51,968 సీట్లు ఉండగా,5 వ తరగతిలో ప్రవేశానికి 88,824 అప్లికేషన్లు రాగా,6వ తరగతి ప్రవేశానికి 32,672 అప్లికేషన్లు వచ్చాయని మొత్తంగా గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మొత్తం 1,67,708 అప్లికేషన్లు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులంతా తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలని ,గురుకులాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది, నాణ్యమైన విద్య తో పాటు మెస్ ఛార్జీలు పెంచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.రేపు జరిగే గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధ్యార్థులంతా ప్రశాంతత వాతావరణం లో రాయాలని , విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ అని తెలిపారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
