* 10 మంది మృతి , వేయి మందికి పైగా క్షతగాత్రులు
* మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం
* రిక్టర్ స్కేల్ పై 7,4 తీవ్రతగా నమోదు
ఆకేరు న్యూస్ డెస్క్ : తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్, పిలిప్పీన్స్, చైనాలో కూడా కొంత మేర భూకంప ప్రభావం కనిపించింది. గత 25 ఏళ్ళ తర్వాత వచ్చిన అతి భారీ భూకంపం అని తైవాన్ అధికారులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. బుధవారం ఉదయం 7.3ం గంటలకు ఒక్కసారిగా తైవాన్ వణికి పోయింది. అత్యంత తీవ్రతతో వచ్చే ప్రకంపనాల వల్ల బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కూలి పోయాయి. కొన్ని భవనాలు పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోయాయి. భవన శిథిలాల్లో చాలా మంది చిక్కుకు పోయారంటున్నారు. పది మంది వరకు మృతులు వేయి మందికి పైగా క్షత గాత్రులు ఉండే అవకాశం ఉందని తైవాన్ అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. గత ఇరవై ఐదేళ్ళ తర్వాత వచ్చిన భారీ భూకంపం అంటున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని ప్రభుత్వ సహాయ సిబ్బంది రక్షించారు. జపాన్, పిలిప్పీన్స్ , చైనాలోనూ భూకంప తీవ్రత స్వల్పంగా ఉంది. 1999 లో తైవాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. 2,500 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. భూకంపం తర్వాత సునామి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు
తైవాన్ భూకంప తీవ్రత దృశ్యాలు..
——————————-