
మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం..
* మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ యత్నాలు
* ఎయిర్పోర్ట్ వద్ద ఇరు పార్టీల నేతల తోపులాట
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా మామూనూర్ (Mamunur) విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుండగా, రాజకీయంగా వేడి మొదలైంది. తమ వల్లే ఎయిర్‌పోర్టు ( Airport) అభివృద్ధి జరుగుతోందని ఏ పార్టీకాపార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఆ క్రెడిట్ కోసం జాతీయ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్ తమదంటే తమదంటూ బీజేపీ(Bjp), కాంగ్రెస్(Congress) శ్రేణులు వాదనలకు దిగాయి. ఎయిపోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధానమోదీకి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్ పోర్టు దగ్గరకు శనివారం బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడకు చేరుకుని తమ ప్రభుత్వం వల్లనే ఎయిర్ పోర్ట్ రెడీ అవుతోందని నినాదాలు ఇచ్చాయి. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం మొదలైంది. చివరకు తోపులాటలకు దిగాయి.
—————–