* కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
ఆకేరున్యూస్, ఢల్లీి: రీజినల్ రింగ్‌రోడ్డు కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హావిూ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డు, హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ‘సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ వరకు ఆర్ఆర్ఆర్ టెండర్ల పక్రియ పూర్తయింది. దాదాపు 95శాతం భూ సేకరణ కూడా పూర్తయింది. రూ.వెయ్యి కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేశారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతున్నందున.. గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. 62 కి.విూ మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
