
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన నాగపురి రాజు గౌడ్ హైదరాబాదులో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. కన్న ఊరికి,ఊరి ప్రజలకు సేవ చేయాలనీ ఉద్దేశంతో గుండేడు గ్రామంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తన స్వంత ఖర్చులతో తరగతి గదులకు కావాల్సిన తలుపులు,పాఠశాలకు రంగులు వేయించడం, గ్రామంలో సరైన బస్ స్టాప్ లేకపోవడంతో బస్టాప్ నిర్మాణం,పోచమ్మ గుడిని అభివృద్ధి కోసం, కన్నూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రంగులు వేయటం వంటి కార్యక్రమాలను ప్రారంభించాడు.కార్యక్రమంలో నాగపూరి సాంబయ్య,మాజీ జెడ్పిటిసి కళ్యాణి లక్ష్మణ్ రావు,సత్యనారాయణ రావు,నవీన్, మాట్ల రమేష్, మేకల రవి,తిరుపతిరావు, చిన్న సాంబయ్య, ఓదెలు,నాంపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
……………………………….