* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
ఆకేరున్యూస్, వరంగల్: సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని, ఒక వేళ వెళ్ళాసి వస్తే తగు జాగ్రత్తలను పాటించాలని, ప్రధానముగా బహిరంగ ప్రదేశాలపై, అనుమతి లేకుండా వ్యక్తులపై, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని. హోలీ పండుగను సజావుగా జరుపు కొనేందుకు వరంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించ బడుతుందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
