15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ ..
ఆకేరున్యూస్, కర్నూలు :
ఊరు.. ఊరంతా ఉగాది ( Ugadi ) సంబరాల్లో మునిగితేలుతోంది. తెలుగువారి పండుగ కావడంతో పిల్లలు, పెద్దలు సంబరాలు చేసుకుంటున్నారు. పిల్లలు ఉత్సాహంగా ఉగాది ప్రభను లాగుతున్నారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం. ఏకంగా 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. కర్నూలు ( Kurnool ) జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉగాది ప్రభ లాగుతున్న చిన్నారులకు విద్యుత్ షాక్ ( Short Circuit )తగలడంతో 15 మందికి గాయాలయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామస్తుల సహకారంతో హుటాహుటిన పిల్లలను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని చెప్పడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రథోత్సవం సాగే దారిలో అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించామని, సరఫరా కూడా ఆపేశామని, అయినా.. ఏ వైరు ద్వారా ఇలా జరిగిందో విచారణ చేపడుతున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
