World Tourism Day 2026
* వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్
ఆకేరు న్యూస్,ములుగ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన జిల్లాలలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ.. జిల్లాలలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. యువ టూరిజం క్లబ్‌ల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలలో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జ్ఞాన భారత్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, జిల్లాలోని వివిధ ప్రాంతాలు, దేవాలయాలు, మఠాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్న మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి సమగ్ర జాబితా రూపొందించాలని తెలిపారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని, పర్యాటక ప్రాంతాలను ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా టూరిజం నోడల్ ఆఫీసర్ డాక్టర్ ధర్మ నాయక్, డి ఈ ఓ సిద్ధార్థ రెడ్డి, డి ఐ ఓ వీరేందర్, డి పి ఆర్ ఓ రఫిక్, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
