
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వరంగల్లో లక్షలాదిమంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనునట్లు పార్టీ ప్రకటించింది.
………………………………