* శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మెడలో మిర్చి దండలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS Mlcs) వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని శాసన మండలి ఆవరణలో ఆందోళన చేపట్టారు. రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి బోర్డు(Mirchi Board)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయిందని, సరైన ధర లేకపోవడంతో ఈ సీజన్లో 2లక్షలా 40 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని, మిర్చి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.25 వేల నిర్ణయించి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి(Madhusudhanachari), ఎమ్మెల్సీలు కవిత(kavitha), నవీన్ కుమార్, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్ కుమార్ రెడ్డి, వాణి దేవి పాల్గొన్నారు.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
