* టైమ్ ప్రకటించిన నాసా
ఆకేరున్యూస్: అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో ఆదివారం విజయవంతంగా అనుసంధానమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు వచ్చే సమయాన్ని నాసా తాజాగా ప్రకటించింది. ఈనెల 18 అంటే మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వారు భూమ్మీద ల్యాండ్ కానున్నట్లు తెలిపింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకురానున్నట్లు నాసా ప్రకటించింది.
……………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
