Nani
Nani: ఆకేరు న్యూస్, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ప్రెస్మీట్లో నాని సినిమా విశేషాలను వెల్లడించారు.
* ఇంటెన్స్ యాక్షన్
ది ప్యారడైజ్ (The Paradise) తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన సినిమా అని నాని తెలిపారు. తన కెరీర్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనని చెప్పారు. ది ప్యారడైజ్ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్ బిల్డింగ్, ఎనర్జీ, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ స్పెక్టక్యులర్గా ఉంటాయి. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
* తల్లి, కొడుకుల కథ
ఈ సినిమా ప్రధానంగా తల్లి, కొడుకుల మధ్య సాగే కథ అని నాని వెల్లడించారు. ఇందులోని మదర్-సన్ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. సినిమాలోని ఎమోషన్‌తో పాటు మంచి కమర్షియల్ థియేట్రికల్ అనుభూతి ఉంటుందని తెలిపారు. అనిరుధ్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నాని పేర్కొన్నారు.
* జడల లుక్ వెనుక కథ
సినిమాలో తన జడల లుక్ కథలో భాగమేనని నాని తెలిపారు. ఈ చిత్రంతో జడల ట్రెండ్ మళ్లీ మొదలవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్లు వెల్లడించారు. కన్నడ వెర్షన్లో తన పాత్రకు నటుడు దీక్షిత్ డబ్బింగ్ చెప్పారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లోనూ ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
