BRS Celebrations
BRS Celebrations: ఆకేరు న్యూస్, కమలాపూర్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డీజే పాటలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు శుక్రవారం స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసిందన్నారు. హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల అంశంలో కీలక పరిణామమని పేర్కొన్నారు. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, వార్డు మెంబర్ సముద్రాల సదయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జక్కుల రాజు, మాజీ సర్పంచులు ఎర్రబెల్లి దేవేందర్ రావు, ర్యాకం మొండయ్య, మాజీ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి శ్రీధర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
