* కుంభమేళా విజయంతో మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలు పటాపంచలు
* భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత : మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : కుంభమేళా విజయంతో మన సామర్థ్యంపై ఉన్న కొద్దిపాటి అనుమానాలు కూడా పటాపంచలు అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ మోదీ (Narendra Modi) అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. కుంభమేళా విజయం అందరి కృషి ఫలితం అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసిందన్నారు. ప్రజలందరి కృషితో కుంభషమేళా విజయవంతమైందన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా(Kumbhmela) పటాపంచలు చేసిందని మోదీ అన్నారు. కుంభమేళా ప్రజల్లో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచిందన్నారు. ఆధ్యాత్మిక ఐక్యత కోసం దేశం అంతా ఒకచోటుకు వచ్చిందన్నారు. కుంభమేళా నిర్వహణ భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు. కుంభమేళా జలాలను మారిషస్ (Marishes)కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ జలాలతో మారిషస్ లో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. మన ఉత్సవాలను జరుపుకోవాలనే ఆకాంక్షను రగిలించిందన్నారు. భారత సామర్థ్యానికి మహా కుంభమేళా ప్రతీక అన్నారు. కుంభమేళాకు పొరుగు దేశాల నుంచి కూడా ఆదరణ లభించిందన్నారు. మన సంస్కృతులను యువత ఆపాదించుకున్నారని, భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ ప్రత్యే్కత అని చాటి చెప్పారు.
………………………………..
