* హెచ్సీయూ భూముల వేలానికి నిరసనగా బీజేవైఎం ముట్టడి యత్నం
* బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లోపల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, బయట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (Hyderaba Central University) చెందిన 400 ఎకరాల భూముల వేలాన్ని నిరసిస్తూ బీజేవైఎం(Bjym) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకో్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. హెచ్ సీయూ భూములను వేలం వేయడంపై ఆందోళన చేపట్టారు. పలువురు బీజేవైఎం కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswarreddy) కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు ఆయనను కూడా అరెస్ట్ చేసి బోయిన్పల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
