
* ఏకమవుతున్న దక్షిణాది
* తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధుల హాజరు
* డీలిమిటేషన్‌పై జరిగే నష్టం ఏంటి?
* ఆ రాష్ట్రాలు కేంద్రంపై యుద్ధానికి ఏకం కానున్నాయా?
* ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటి?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు, నియోజకవర్గాలు నష్టపోతాయని వాదిస్తున్నాయి. డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం.. భారత తాజా జనాభా లెక్కలు ప్రకారం వివిధ శాసనసభల, లోక్‌సభల నియోజకవర్గాల సరిహద్దుల పునఃరూపకల్పన చేయడం ఈ ప్రక్రియ ఉద్దేశం. దీని వల్ల జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య మారుతుంది. డిలిమిటేషన్ చట్టం, 2002లోని నిబంధనల ప్రకారం 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత నియోజకవర్గాల విభజన జరిగింది. అప్పటి నుంచీ అదే కొనసాగుతోంది. అయితే తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై దృష్టి సారిస్తోంది.
గతంలో ఇలా..
డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ది సరిహద్దుల కమిషన్) లేదా సరిహద్దు కమిషన్, అనేదానిని, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం. కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం భారత తాజా జనాభా లెక్కలు ప్రకారం వివిధ శాసనసభల, లోక్‌సభల నియోజకవర్గాల సరిహద్దుల పునఃరూపకల్పన చేయడం ఈ ప్రక్రియ సమయంలో ప్రతి రాష్ట్రం నుండి ఇంతకు ముందు ఉన్న ప్రాతినిధ్యం మార్చబడదు. అయితే జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఎస్.సి, ఎస్.టి. స్థానాల సంఖ్య మారుతుంది. తొలిసారిగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో డీలిమిటేషన్ నిర్ణయం ప్రకారం నియోజకవర్గాలు ఏర్పాడ్డాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం 494 లోక్‌సభ నియోజకవర్గాలుగా నిర్ణయించారు. అనంతరం 1963లో పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1961 జనాభా లెక్కల ప్రకారం 522 నియోజకర్గాలుగా పెంచారు. 1971 జనాభా లెక్కలు చేపట్టిన పుర్విభజన ప్రకారం1973లో లోక్‌సభ స్థానాల సంఖ్య 522 నుంచి 543కు పెరిగాయి. 2002లో వివిధ రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల కేటాయింపులో ఎలాంటి మార్పులూ లు లేవు. అప్పటి నుంచీ అదే సంఖ్య కొనసాగుతోంది. తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్‌పై దృష్టి కేంద్రీకరిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..
కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతూ వస్తోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు, తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తక్కువ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈక్రమంలో లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా పార్లమెంట్లో విధానపరమైన నిర్ణయాల్లో తమ వాణి వినిపించడంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. అందువల్లే కొన్ని రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి. ఈక్రమంలోనే తమిళనాడు లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను కూడా స్టాలిన్ ఆహ్వానించారు. కాగా ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ కూడా డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలపై చర్చించనున్నారు. చెన్నై సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుని, భవిష్యత్తులో ఒక కూటమిగా నిలిచి ఈ అన్యాయాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఐక్యత మరింత బలపడుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన మలుపు కావొచ్చని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధానికి జగన్ లేఖ
మరోవైపు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా డీలిమిటేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఆయా రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూడాలని లేఖలో కోరారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల జనాభా బాగా తగ్గిందని, అందుకు కారణం జనాభా నియంత్రణపై కేంద్రం ఇచ్చిన పిలుపే కారణమని పేర్కొన్నారు. జనాభా లెక్కల పునర్విభజన చేస్తే పార్లమెంట్లో కొన్ని రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందని, విధాన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండేలా చూడాలని అన్నారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గకుండా పునర్విభజన చేయాలని కేంద్రాన్ని కోరారు.
…………………………………………..