
* తెలుగు బదులు హిందీ ప్రశ్న పత్రం
* 2 గంటలు టెన్షన్.. టెన్షన్
* ఇద్దరు అధికారులు సస్పెండ్
ఆకేరున్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రంలోని ఓ పరీక్ష కేంద్రంలో ఒక పేపరు బదులు మరొక పేపర్ కేంద్రానికి చేరుకుంది. ఈ సంఘటన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షకు అవంతరాలు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష కేంద్రంకు తెలుగు ప్రశ్న పత్రం బదులుగా హిందీ ప్రశ్న పత్రం చేరుకుంది. దీంతో ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం గుర్తించిన పరీక్ష కేంద్రాల సిబ్బంది డీఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కలెక్టర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన వారందరు పరీక్ష కేంద్రం చేరుకొని ప్రశ్న పత్రం హిందీ తీసుకొని తెలుగు ప్రశ్న పత్రం అందించారు. దీనికోసం 2 రెండు గంటల సమయం పట్టింది. విద్యార్థులకు ఉదయం 11:30 తెలుగు ప్రశ్న పత్రం ఇవ్వడంతో పరీక్ష మరో రెండు గంటల సమయం పొడిగించారు. రెండు గంటల పాటు టెన్షన్ వాతావరణ నెలకొంది. విద్యార్థులు తెలుగు పరీక్ష రాయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
……………………………………